విశాఖ జిల్లా చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్ అధ్వర్యంలో మహిళ, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు తలపడుతున్నాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కబడ్డీ రిఫరీల అసోసియేషన్ ఛైర్మన్ కె.బాలు, సమన్వయకర్త దాసులు పేర్కొన్నారు.
అంకుపాలెంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
విశాఖపట్నం జిల్లా అంకుపాలెంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
అంకుపాలెంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
అంకుపాలెం గ్రామంలోని దుర్గదేవి తీర్థమహోత్సవం సందర్భంగా ఏటా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను చోడవరం పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇలియాస్ మహమ్మద్ ప్రారంభించారు.
ఇదీ చదవండి:చీడికాడలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్