విశాఖ జిల్లా చోడవరంలో అండర్ - 19 బాల బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ బోర్డ్ ప్రాంతీయాధికారి నగేష్ వీటిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 మంది క్రీడాకారులు తరలివచ్చారు. నగేష్ మాట్లాడుతూ.. కబడ్డీ ఆట కలిసికట్టుతనాన్ని నేర్పుతుందన్నారు. ఈ నెల 31 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. రీజనల్ ఇన్స్పెక్టర్ బి. సుజాత తదితరులు హాజరయ్యారు.
చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు - వైజాగ్లో కబడ్డీ పోటీలు తాజా వార్తలు
కబడ్డీ ఆట కలిసికట్టుతనాన్ని నేర్పుతుందని ఇంటర్ బోర్డు ప్రాంతీయాధికారి నగేశ్ అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.
![చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4905556-1014-4905556-1572411151343.jpg)
చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు ప్రారంభం