ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NAGARJUNA REDDY: విద్యుత్‌ ఛార్జీల పెంపు అనివార్యం..: జస్టిస్ నాగార్జున రెడ్డి - Justice Nagarjuna Reddy interview

NAGARJUNA REDDY: ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ ఛార్జీల పెంపు అనివార్యమని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు భారం కాకుండా అటు పంపిణీ సంస్ధలకు కొంత ఆర్ధికంగా ఊరటనిచ్చే విధంగా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీలోనే తక్కువ విద్యుత్ ధరలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఛార్జీల పెంపు తగదు అనే మైండ్ సెట్ నుంచి ప్రజలు బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై విశాఖలో వర్చువల్‌గా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరగలేదంటున్న జస్టిస్ నాగార్జున రెడ్డితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌తో ముఖాముఖి
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌తో ముఖాముఖి

By

Published : Jan 30, 2022, 12:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details