SOMU VEERRAJU ANGER: ప్రధాని పర్యటన వేళ విశాఖ సిరిపురం కూడలి వద్ద భాజపా జెండాలను ఏర్పాటు చేసింది. వాటిని అధికారులు తొలగిస్తుండగా.. అటుగా వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చూసి అక్కడకు చేరుకున్నారు. జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. సోము ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విశాఖలో భాజపా జెండాల తొలగింపు.. సోము వీర్రాజు ఆగ్రహం - భాజపా
SOMU VEERRAJU: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో భారీ ఎత్తున భాజపా నేతలు స్వాగతం పలుకుతూ.. జెండాలు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు సిరిపురం కూడలిలో జెండాలు తొలగిస్తుండగా.. అదే దారిలో వెళ్తున్న సోము వీర్రాజు చూసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
Last Updated : Nov 11, 2022, 6:11 PM IST