ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన బ్యాడ్మింటన్​ స్టేట్ టోర్నమెంట్ పోటీలు - State Badminton Tournament at visakha news

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి ఆర్​సీఎం షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో స్టేట్ టోర్నమెంట్ పోటీలు వైభవంగా ముగిశాయి. నర్సీపట్నంలో ప్రముఖ వైద్యులు రెడ్డి శ్రీనివాసరావు, పట్టణ సీఐ స్వామి నాయుడు కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.

State Badminton Tournament
ముగిసిన స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

By

Published : Oct 25, 2020, 4:06 PM IST

Updated : Nov 4, 2020, 2:35 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి ఆర్​సీఎం షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన స్టేట్ టోర్నమెంట్ పోటీలు వైభవంగా ముగిశాయి. రోమన్ క్యాథలిక్ చర్చి ఆవరణలో ఈ పోటీలను నిర్వహించగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి సంబంధించి నర్సీపట్నంలో ప్రముఖ వైద్యులు రెడ్డి శ్రీనివాసరావు, పట్టణ సీఐ స్వామి నాయుడు విజేతలకు బహుమతులను అందజేశారు. ఆర్​సీఎం స్కూల్ బ్యాడ్మింటన్​ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ టోర్నమెంట్ ప్రతి ఏటా దసరా సీజన్లో నిర్వహించడం ఈ ప్రాంత క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పట్టణ సీఐ అన్నారు. పోటీల్లో గెలుపొందిన ప్రథమ విజేతలకు రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.15,000, తృతీయ బహుమతి రూ.పది వేలు చొప్పున అందజేశారు.

ఇవీ చూడండి...

రంగుల హరివిల్లులా.. బొమ్మల కొలువు

Last Updated : Nov 4, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details