విశాఖలో ఘోర ప్రమాదానికి కారణమైన స్టైరీన్ వాయువు తరలింపు కార్యక్రమం వేగవంతమైంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోడ్ మార్గంలో విశాఖ పోర్ట్‌కి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 14 ట్యాంకర్లు ద్వారా రసాయనాన్ని నింపి పోర్ట్‌కి తరలించారు. మొత్తం తరలింపునకు మరో మూడు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.
వేగవంతంగా స్టైరీన్ గ్యాస్ తరలింపు - corona news in vizag
విశాఖలో స్టైరీన్ వాయివు తరలింపును అధికారులు వేగవంతం చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఎల్జీ పరిశ్రమ బృందం ఈ తరలింపు ప్రక్రియను పరిశీలించింది.
starin gas shifted from visakha LG palimars gas industry
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఉన్న రసాయనాని పూర్తిగా తరలించడానికి ఇప్పటికే విశాఖ పోర్టులో ప్రత్యేక నౌకను సిద్ధం చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఎల్జీ పరిశ్రమ బృందం ఈ తరలింపు ప్రక్రియను పరిశీలించింది. సుమారు ఆరు గంటల సేపు ప్లాంట్‌లో గడిపిన దక్షిణ కొరియా బృందం ప్రమాద ఘటన జరిగిన సమయంలో ఉన్న సిబ్బంది విచారించారు. ప్రమాదం జరిగిన తీరు అధ్యయనం చేశారు. వాయువు బయటకు వెళ్లిన తీరు, ఎంత పరిధిలో ప్రాంతానికి వాయువు ప్రయాణించిందనే విషయాలను అధ్యయనం చేశారు.