ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర సమస్యగా స్టాంప్‌ పేపర్ల కొరత.. ప్రత్యామ్నాయంపై అధికారుల దృష్టి - తీవ్ర సమస్యగా మారిన స్టాంప్‌పేపర్ల కొరత

రిజిస్ట్రేషన్‌ల శాఖలో స్టాంపు పేపర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. లాక్‌డౌన్‌ తర్వాత ఏర్పడ్డ పరిణామాల దృష్ట్యా వీటి దిగుమతి భారీగా తగ్గింది. ప్రధానంగా వంద రూపాయల బాండ్‌లు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Stamps Shortage
Stamps Shortage

By

Published : Mar 3, 2021, 1:51 PM IST

తీవ్ర సమస్యగా మారిన స్టాంప్‌పేపర్ల కొరత

రిజిస్ట్రేషన్‌లలో ఎప్పటికీ బిజీగా ఉండే.. విశాఖ జిల్లాలో స్టాంప్‌ పేపర్ల కొరత సమస్యగా మారింది. 100 రూపాయల విలువ గల స్టాంప్‌ పేపర్లు లేకపోవడం వల్ల.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 100 రూపాయల బాండ్‌ పేపర్‌కు బదులు.. రెండు 50 రూపాయల బాండ్‌ పేపర్లతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. స్టాంపు పేపర్ల కొరతతో నల్లబజారులో అధికరేట్లకు అమ్మడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

లాక్‌డౌన్ ముందు వచ్చిన స్టాక్ తోనే ఇప్పటివరకు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతూ వస్తున్నాయి. జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది.ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల దృష్ట్యా.. ఏ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో.. బాండ్‌ల వినియోగం తక్కువ ఉందో అక్కడి నుంచి అవసరమైన చోటకు సర్దుబాటు చేస్తున్నారు.

విశాఖలో రోజూ 500 నుంచి వెయ్యి వరకూ రిజిస్ట్రేషన్‌లు అవుతుంటాయి. వంద రూపాయల బాండ్‌ పేపర్లు కనీసం వెయ్యి వరకూ ఉపయోగిస్తుంటారు. ప్రభుత్వం బాండ్‌ల కొరతపై దృష్టి పెట్టకుంటే.. ఈ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడం కష్టమనే అభిప్రాయం అధికారుల్లో ఉంది.

ఇదీ చదవండి:

'రీ నామినేషన్లు' నిలిపివేత.. ఎస్​ఈసీ ఉత్తర్వులు చెల్లవన్న హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details