స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమం సోమవారం నుంచి విశాఖ జిల్లాలో ఆరంభం కానుంది. ఈ శాఖ సంస్కరణలలో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుని...తమకు అనువైన సమయాన్ని ఎన్నుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వేచి ఉండకుండా ఈ నూతన విధానం తోడ్పడనుంది. కొత్త విధానం ద్వారా సకాలంలో ఎటువంటి అదనపు రుసుం లేకుండా,ఎవరిపైనా ఆధారపడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా జరగునుంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ డేటా ఎంట్రీ ! - స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమకు తామే రూపొందించుకునే విధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నమూనాలను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. తాజాగా ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమం సోమవారం నుంచి విశాఖలో ఆరంభం కానుంది.

స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమం
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమం