విశాఖలోని 128 ఎకరాల ప్రభుత్వ స్థలం, అందులోని కట్టడాలను తనఖా పెట్టేందుకు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలను మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఆర్ధిక సంస్థలకు తనఖా పెట్టనున్న 128.65 ఎకరాల భూమికి స్టాంపు డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయిస్తూ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆర్థిక సంస్థలకు తనఖా పెట్టనున్న 128.65 ఎకరాల భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ లావాదేవీలకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీ ఎస్డీసీ ద్వారా బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల వద్ద ఈ భూమిని తనఖా పెట్టి నిధులను ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వ స్థలం తనఖా...స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ నోటిఫికేషన్ - విశాఖపట్నం ముఖ్యంశాలు
విశాఖలోని 128 ఎకరాల ప్రభుత్వ స్థలం, అందులోని కట్టడాలను తనఖా పెట్టేందుకు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలను మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఆర్ధిక సంస్థలకు తనఖా పెట్టనున్న 128.65 ఎకరాల భూమికి స్టాంపు డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయిస్తూ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
విశాఖపట్నం తాజా స్థలం