ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో ఎస్టీ కమిటీ సభ్యులు పర్యటన - state st committee latest visit news

అరకు పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్ర ఎస్టీ కమిటీ సభ్యులు విశాఖ మన్యంలో పర్యటించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించారు.

విశాఖ మన్యంలో పర్యటించిన ఎస్టీ కమిటీ సభ్యులు
విశాఖ మన్యంలో పర్యటించిన ఎస్టీ కమిటీ సభ్యులు

By

Published : Mar 5, 2020, 9:26 PM IST

విశాఖ మన్యంలో పర్యటించిన ఎస్టీ కమిటీ సభ్యులు

విశాఖ ఏజెన్సీ పాడేరులో రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్ బాలరాజు అధ్యక్షతన కమిటీ సభ్యులు పర్యటించారు. అరకు పర్యటన ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు నేరుగా పాడేరు మోదకొండమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి వైద్యం అందుతున్న తీరుతెన్నులు తెలుసుకున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని జేసీ లోతేటి శివ శంకర్​ను కమిటీ ఛైర్మన్ బాలరాజు ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు, వివిధ సంఘాల నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలుపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details