తితిదే సారథ్యంలో విశాఖలోని రుషికొండ సమీపంలో.. కొండపైన శ్రీవారి కోవెల నిర్మిస్తున్నారు. కొండమీదినుంచి..సముద్ర అందాలను చూడొచ్చు. మరికొన్ని రోజుల్లోనే ఈ దేవాలయం అందుబాటులోకి రానుంది. విశాఖ రుషికొండ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తోంది. సువిశాల ప్రాంగణంలో శ్రీదేవి అలివేలు మంగతాయారు సమేత వెంకటేశ్వరుడి ఆలయాన్ని కట్టిస్తున్నారు వచ్చేనెల రెండో వారంలో ఈ ఆలయాన్ని ప్రారంభించాలని తితిదే భావిస్తోంది. భీమిలి రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయానికి.. ఘాట్ రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారు. గోవింద నామాలతో విద్యుత్ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సముద్రానికి ఎత్తులో శ్రీవారి ఆలయం.. మీరూ వెళ్లండి! - శ్రీవారి ఆలయం
సాగర తీరంలో కలియుగ ప్రత్యక్షదైవం త్వరలో కొలువుదీరబోతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలకు తన దివ్యాశీస్సులు అందించబోతున్నాడు. విశాఖ నగరంలోని రుషికొండ తీరంలో... తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించింది. వచ్చే నెల రెండో వారంలో ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని తితిదే భావిస్తోంది.
రుషికొండ వద్ద శ్రీవారి ఆలయం
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే వెంకటేశ్వరుని ఆలయానికి ఎదురుగా ఆంజనేయ ఆలయాన్ని పూర్తి చేశారు. చాలా వరకు పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులన్నీ వేగంగా పూర్తిచేసి వచ్చేనెల 1వ తేదీ నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రెండవ వారంలో సంప్రోక్షణ, యజ్ఞ యాగాదులు పూర్తి చేసి స్వామి దివ్యమంగళ రూప సాక్షాత్కారం భక్తులకు అందించనున్నారు.
ఇదీ చూడండి.శ్రీవారికి రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకం అందజేత