విశాఖ జిల్లా అనకాపల్లి గౌరీ పంచాయతీ దేవాలయంలో శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రవచకులు కొణతాల లింగ రామేశ్వరరావు ఆధ్వర్యంలో.. 12 అధ్యాయాలు పూర్తి చేశారు. గత 20 రోజులుగా సాయంత్రం ఆరుగంటల నుంచి 7.30 గంటల వరకు నిర్వహిస్తున్న ప్రవచనాలు వినడానికి.. మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయానికి విచ్చేస్తున్నారు. శ్రీమద్భగవద్గీత అధ్యాయాలు అన్ని పూర్తయ్యేంతవరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గౌరీ పంచాయితీ దేవాలయం అధ్యక్షులు బొడ్డేడ సన్యాసి నాయుడు, కార్యదర్శి బుద్ద రమణా జీలు తెలిపారు.
గౌరీ పంచాయతీ దేవాలయంలో భగవద్గీత ప్రవచనాలు - విశాఖలోని గౌరీ పంచాయతీ దేవాలయంలో శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు తాజా వార్తలు
ప్రవచకులు కొణతాల లింగ రామేశ్వరరావు ఆధ్వర్యంలో.. అనకాపల్లి గౌరీ పంచాయతీ దేవాలయంలో శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు నిర్వహించారు. శ్రీమద్భగవద్గీత అధ్యాయాలు అన్ని పూర్తయ్యేంతవరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దేవాలయ అధ్యక్షులు పేర్కొన్నారు.
![గౌరీ పంచాయతీ దేవాలయంలో భగవద్గీత ప్రవచనాలు Srimad-Bhagavatam pravachanalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11315859-975-11315859-1617795718414.jpg)
గౌరీ పంచాయతీ దేవాలయంలో శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు