లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల వలస కూలీల వేదన వర్ణనాతీతం. బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కాలినడకనే తమ స్వస్థలాలకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వలస కార్మికులు విశాఖలో భవన కార్మికులుగా పనిచేసేవారు. అయితే కరోనా నేపథ్యంలో వారు ఉపాధి కోల్పోయారు. గడిచిన 43 రోజులుగా దాతలు పెట్టిన తిండి తింటూ నగరంలో తలదాచుకున్నామని.. ఇంకా పరిస్థితిలో మార్పు రావకపోవడం వల్ల కాలినడకనే ఊరికి వెళ్తున్నామని చెప్పారు. తమకు ఉపాధి దొరికే ఆశ కనిపించకపోవడం వల్ల ఇంటిబాట పట్టామని దీనంగా చెబుతున్నారు. వీరు పలాసకు చేరాలంటే దాదాపు 200 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
పల్లెకు పోదాం.. పాదమే శరణ్యం.. - srikakulam migrant workers problems in visakha
ఉపాధి లేదు. మళ్లీ దొరుకుతుందన్న ఆశా లేదు. దాతలెవరైనా సాయం అందిస్తే ఆ పూట కడుపు నిండుతుంది. తిరిగి తమ ఊరికి వెళ్దామంటే రవాణా సదుపాయం లేదు. ఈ క్రమంలో ఆ వలస కూలీలు తమ కాళ్లనే ఆసరాగా చేసుకుంటున్నారు. తమ వారిని చూడాలనే ఆకాంక్షతో పాదం వల్ల కాదంటున్నా పయనం సాగిస్తున్నారు. విశాఖ నుంచి సిక్కోలుకు వలస ప్రయాణమవుతున్నారు.
ఊరికి పోదాం.. పాదమే శరణ్యం..