ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు రద్దు - విశాఖపట్నం ముఖ్య వార్తలు

విశాఖ జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ వారి మహోత్సవాలు రద్దయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. వేడుకలకు సూచికగా.. పూజలు చేశారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఉత్సవాలు
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఉత్సవాలు

By

Published : May 16, 2021, 4:38 PM IST

ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి జాతర మహోత్సవాలు రద్దు అయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. ఉత్సవాలను నిరాడంబరంగా ప్రారంభించారు.

ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారు అమ్మవారిని పూజించుకోవాలని కోరారు. ప్రతి ఏటా మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఉత్సవాలు సాధారణంగా జరుగుతుండడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details