ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

330 కిలోల శ్రీ చందనం పట్టివేత - చోడవరంలో శ్రీచందనం అక్రమ రవాణా

విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న శ్రీచందనం ముక్కలను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 6.6 లక్షలు ఉంటుందని తెలిపారు.

sri chandanam
శ్రీచందనం

By

Published : Oct 24, 2020, 8:10 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలంలో పోలీసులు పెద్ద ఎత్తున శ్రీ చందనం ముక్కలను పట్టుకున్నారు. 330 కిలోల బరువున్న చందనం విలువ సుమారు రూ.6.6 లక్షలు ఉంటుందని తెలిపారు.

చోడవరం మండలం వెంకన్నపాలెం చెక్​పోస్ట్ వద్ద టాస్క్​ఫోర్స్, పోలీసులు తనిఖీ చేస్తుండగా.. వ్యాన్​లో తరలిస్తున్న శ్రీచందనం బయటపడింది. వీటిని పాడేరు పరిసర ప్రాంతం నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేరళకు చెందిన అబ్దుల్ సలీం, విశ్వనాథ్​లను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details