సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం కావటంతో అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా భక్తులను కుంకుమ పూజకు అనుమతించలేదు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తుల పేర్లుతో పూజలు నిర్వహించారు. నిత్య అన్నదాన పథకానికి నేటితో 31 ఏళ్లు పూర్తి కావటంతో భక్తులకు పాయసం వితరణ చేశారు.
సింహాచలంలో ఘనంగా శ్రావణ శుక్రవార కుంకమ పూజలు - simhachalam temple news
విశాఖ జిల్లా వాసుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో.. శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిపారు. కరోనా కారణంగా భక్తులెవ్వరినీ కుంకుమ పూజకు అనుమతించలేదు.
సింహాచలంలో ఘనంగా శ్రావణ శుక్రవార కుంకమ పూజలు