దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం కలశ స్థాపనతో వేడుకలు మొదలయ్యాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు కొనసాగుతాయని... అమ్మవారిని ప్రతిరోజూ విశిష్ట అలంకరణల ద్వారా భక్తులకు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 26 సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. పెద్ద బొడ్డేపల్లిలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 21న సరస్వతీదేవి అవతారం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలతోపాటు.. ప్రత్యేక పూజ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.
దుర్గామల్లేశ్వర ఆలయంలో మొదలైన శరన్నవరాత్రుల శోభ - splendor of Sharannavarathrulu started at Durgamalleshwara temple
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం కలశ స్థాపనతో వేడుకలు మొదలయ్యాయి.
splendor-of-sharannavarathrulu-started-at-durgamalleshwara-temple
Last Updated : Oct 17, 2020, 1:00 PM IST