ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఘటన నేపథ్యంలో పరిశ్రమల్లో తనిఖీలు - విశాఖ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం...పరిశ్రమల్లో ప్రత్యేక బృందం తనిఖీలు

విశాఖ విషవాయువు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ యాజమాన్యాలు తీసుకుంటున్న భద్రత చర్యలపై నివేదిక కోరింది. ఈమేరకు ప్రత్యేక బృందం విశాఖ జిల్లా భీమిలోని దివీస్ లేబరేటరీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

specil-team-visit-divis-laboratories
పరిశ్రమల్లో తనిఖీలు

By

Published : May 15, 2020, 1:28 PM IST

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన సంభవించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ యాజమాన్యాలు తీసుకుంటున్న భద్రత చర్యలపై ప్రభుత్వం నివేదికలు కోరింది. ఈ నేపథ్యంలో భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో ఉన్న దివీస్ లేబరేటరీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రంగాలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం ఇవాళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.

అపాయకరమైన కెమికల్స్ ఎక్కడ నిలువ చేస్తున్నారు. కెమికల్స్ నిలువ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా ?లేదా ? అనే అంశాలను తనిఖీ బృందం సభ్యులు పరిశీలించారు. తాము నిర్వహించిన తనిఖీలలో అనేక విషయాలను గుర్తించినట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ పి.జె. రావు తెలిపారు. ప్రభుత్వానికి ఈ విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details