ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే - train in telugu states latest news

జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం నడపనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు నడవనున్నాయి. విశాఖ నుంచి కూడా పలు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపికచేశారు.

special trains in ap
special trains in ap

By

Published : May 21, 2020, 8:37 PM IST

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లు నడపనున్నారు. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపికచేశారు. ఇప్పటికే వీటికి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్లు అయిపోయాక 200 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరే స్లీపర్‌, ఏసీ, జనరల్‌ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు.

తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు...

  • ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02701/02)
  • హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02703/04)
  • హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (02723/24)
  • దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92)
  • విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805/06)
  • గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (07201/02)
  • తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (02793/94)
  • హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (02727/28)
  • దురంతో రైళ్లు: సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02285/86) (వారానికి రెండుసార్లు)

విశాఖ నుంచి రైళ్ల సర్వీసులు

  • కొత్త దిల్లీ - విశాఖ ఎపి ఎక్స్ ప్రెస్
  • సికింద్రాబాద్ - విశాఖ గోదావరి ఎక్స్ ప్రెస్
  • భువనేశ్వర్ - ముంబై కొనార్క్ ఎక్స్ ప్రెస్
  • సికింద్రాబాద్ - హౌరా ఫలక్ నుమా ఎక్స్​ప్రెస్​
  • జూన్ రెండు నుంచి విశాఖ - సికింద్రాబాద్ ఎక్స్​ప్రెస్​

జూన్ మూడు నుంచి మరికొన్ని రైళ్లు

  • విశాఖ - కొత్త దిల్లీ ఎపి ఎక్స్ ప్రెస్
  • ముంబై - భువనేశ్వర్ కొనార్క్ ఎక్స్ ప్రెస్
  • హౌరా - సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్

ఇవి ప్రత్యేక రైళ్లుగా నడుస్తాయని గతంలో ఉన్నట్టుగానే వీటికి స్టాపులు ఉంటాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ వివరించారు. వీటికి టిక్కెట్లు ఆన్ లైన్లో నే తీసుకోవాలన్నారు. దివ్యాంగులు, 11 రకాల రోగులకు ఇచ్చే టిక్కెట్ రాయితీలు మినహా మిగిలిన రాయితీలు ఇందులో వర్తించవని స్పష్టం చేశారు. జనరల్ కోచ్ లలోనూ ఆన్ లైన్ టిక్కెట్లు తీసుకోవాలని, రెండో తరగతి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణీకులు తమ ఆహారాన్ని వెంట తెచ్చుకుంటే మేలని, పరిమితంగా ప్యాకేజి ఆహారం సరఫరా ఉంటుందని చెప్పారు. ప్యాంట్రీ సేవలు ఉంటాయన్నారు. ఎసీ బోగీల్లోకి దుప్పట్ల సరఫరా ఉండదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఇక కౌంటర్లలో టికెట్ బుకింగ్​- త్వరలో మరిన్ని రైళ్లు

ABOUT THE AUTHOR

...view details