ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12నుంచి విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు - undefined

ప్రయాణికుల సౌకర్యం కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఈ నెల 12వ తేదీ నుంచి రైల్వే శాఖ దేశ్యవ్యాప్తంగా నడుపనుంది. వీటిలో తూర్పు కోస్తా రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధిలో విశాఖ మీదుగా… విశాఖ నుంచి ప్రయాణించే పలు రైళ్లను ఇటీవలే ప్రకటించింది. వీటికి రిజర్వేషన్ ఈనెల 10 నుంచి ప్రారంభకానున్నట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి పేర్కొన్నారు.

Special trains from 12 via Visakhapatnam
12నుంచి విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు

By

Published : Sep 7, 2020, 7:49 PM IST

ప్రయాణికుల సౌకర్యం కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి రైల్వే శాఖ దేశ్యవ్యాప్తంగా నడుపనుంది. వీటిలో తూర్పుకోస్తా రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో విశాఖ మీదుగా… విశాఖ నుంచి ప్రయాణించే పలు రైళ్లను ఇటీవలే ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు...

విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12న విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్‌ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్‌పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్‌లలో ఆగుతుంది.

విశాఖ మీదుగా నడిచే రైళ్లు

తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్‌ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ శుక్రవారాల్లో సాయంత్రం 4.20 గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో 17 నుంచి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.

గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్‌–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్‌ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్‌గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్‌ కియోంఝర్‌ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లకు టికెట్లు రిజర్వేషన్‌ కౌంటర్స్‌ వద్ద, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్‌ టికెట్స్‌ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు.

ఇవీ చదవండి:

రోడ్లపై యువకుల బైక్​ విన్యాసాలు... బెంబేలెత్తిపోతున్న ప్రజలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details