ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న భూముల్లో అక్రమ నిర్మాణాలు..రంగంలోకి ప్రత్యేక బృందం - అప్పన్న భూములపై వార్తలు

విశాఖ సింహాచలం దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలపై నిజాలు బయట పెట్టేందుకు ప్రత్యేక ఉప కలెక్టర్ బృందం రంగంలోకి దిగింది. అధికారుల బృందం ఇటీవల ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే అక్రమ నిర్మాణాలపై నిగ్గు తేలుస్తామని ఉప కలెక్టర్ సురేంద్ర తెలిపారు.

illegals constructions at appanna lands
ప్రత్యేక ఉప కలెక్టర్ బృందం

By

Published : Oct 20, 2020, 6:34 PM IST

విశాఖ సింహాచలం దేవస్థానం భూముల్లో ఇటీవల చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఉప కలెక్టర్ బృందం సింహాచలం చేరుకుంది. తనకు కేటాయించిన సిబ్బందితో దేవస్థానం భూములు తనిఖీ చేపడతామని ఉప కలెక్టర్ సురేంద్ర తెలిపారు. పంచ గ్రామాల్లో భూ సమస్య పరిష్కారానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

అధికారుల బృందం ఇటీవల ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు గుర్తించి కమిషనర్​కు నివేదిక అందజేస్తామన్నారు. త్వరలోనే అక్రమ నిర్మాణాలపై నిగ్గు తేలుస్తామని ఉప కలెక్టర్ అన్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు

ABOUT THE AUTHOR

...view details