విశాఖ జిల్లా కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సోదరులు మద్దతు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలపై వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
విశాఖ జిల్లాలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు - latest vishaka news
జిల్లాలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సోదరులు మద్దతు ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అనేది గొప్ప పుణ్యకార్యక్రమని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. రాముని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖ సీతమ్మధార అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అయోధ్య రామమందిరం భూమి పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రప్రంచమంతా ఈ రోజు గుర్తించుకునే రోజని, ఎన్నో శతాబ్దాల నుండి రామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. ఈ భూమి పూజ విజయం కావాలని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ మతాలు, కులాలకు సంబంధం లేకుండా మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఇదీ చదవండికుసర్లపూడిలో మరిడిమాంబ ఆలయం ప్రారంభం