విశాఖపట్నంలో గిరిజన యువత కోసం పోలిసు విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పూర్తి కార్యక్రమం ముగిసింది. ఆన్లైన్లో రాత పరీక్షకు అర్హత సాధించిన గిరిజన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొత్తం 166 మంది గిరిజన యువతీ, యువకులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ముగింపు కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ బాబూజీ అట్టాడ,పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ పాల్గొన్నారు.
పోలిసు ఉద్యోగాల కోసమే స్పూర్తి కార్యక్రమం - విశాఖ
విశాఖపట్నంలో గిరిజన యువత కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా స్పూర్తి కార్యక్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజనుల నుంచి విశేష స్పందన వచ్చింది.
విశాఖలో ముగిసిన స్ఫూర్తి కార్యక్రమం