విశాఖ జిల్లా అనకాపల్లిలో గణపతియే నమః కోటి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం ప్రతి ఏడాది వినాయక చవితి ముందు నిర్వహించే కోటి యజ్ఞ కార్యక్రమాన్ని.. బెల్లం మార్కెట్ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
వాట్సప్ ద్వారా కోటి మంత్ర యజ్ఞాన్ని ఆగస్టు 31వ తేదీ కల్లా పూర్తి చేసి కాణిపాకం, చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.