ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నివారణకు గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలి' - payakaraopeta mandal latest news

పాయకరావుపేట మండలంలోని గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక అధికారి వెంకట్​ నారాయణ సమీక్ష జరిపారు. గ్రామాల్లో కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నడుచుకోవాలని వివరించారు.

special officer meeting with payakaraopeta gram secretaries for corona issue
పాయకరావు పేట మండలంలోని గ్రామ కార్యదర్శులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

By

Published : Jul 13, 2020, 2:42 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో ప్రత్యేక అధికారి వెంకట్​ నారాయణ పర్యటించారు. మండలంలోని గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. సీజనల్​ వ్యాధులు గ్రామాల్లో ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలన్నారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా ప్రజలకు అందించాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details