పల్లె, పట్టణాలు అని తేడా లేకుండా.. అంతటా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా స్వచ్ఛత, పరిశుభ్రతకు ప్రాధాన్యత సైతం పెరుగుతోంది. ఈ మేరకు విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పారిశుద్ధ్య మెరుగుపై దృష్టి పెట్టారు.
మాడుగులతో పాటు చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. మురుగు కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పిచికారీ చేశారు. కొవిడ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని అక్కడి సిబ్బందితో పిచికారీ చేయించారు.