ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'5 ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ 19 కోసం సిద్ధం చేయండి'

విశాఖలో కరోనా వ్యాప్తి దృష్ట్యా జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. సిద్ధంగా ఉండాలంటూ 5 ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు అందించారు.

By

Published : May 9, 2020, 7:40 PM IST

special covid hospitals in vizag
special covid hospitals in vizag

విశాఖ జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటి వరకు 5 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ ఆస్పత్రులుగా ఆదేశాలిచ్చారు.

  • గాయత్రి విద్యాపరిషత్ మెడికల్ కళాశాల, ఆస్పత్రి
  • ఎన్నారై ఆస్పత్రి
  • ఇండస్ ఆస్పత్రి
  • రాంనగర్ అపోలో ఆస్పత్రి
  • హెల్త్‌ సిటీ ఎంబీ ఆస్పత్రి

ఈ ఐదు యాజమాన్యాలకు.. సిబ్బందితో సహా ఆస్పత్రిని సిద్దం చేయాలని జిల్లా కొవిడ్ సమన్వయ కర్త డాక్టర్ పివి సుధాకర్ కోరారు. ఇప్పటికే అందులో ఉన్న నాన్ కోవిడ్ రోగులను వేరే ఆసుపత్రులకు తరలించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details