Vaikunta Dwara Darshan in Simhachalam: కొవిడ్ మళ్లీ వ్యాపిస్తున్నందున సింహాచలానికి వచ్చే భక్తులందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలని ఆలయ ఈవో త్రినాథరావు విజ్ఞప్తి చేశారు. భక్తులు వెళ్లు మార్గాలను.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. కార్లు, బైక్‌లపై వచ్చే భక్తులు కొండ దిగువన ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా గల పార్కింగ్ ప్లేస్‌లో నిలపాలని అన్నారు. అక్కడి నుంచి కొండపైకి ఆర్టీసీ, దేవస్థానం బస్సుల్లో రావాలని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జనవరి 2న.. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకూ వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు.
సింహాద్రి అప్పన్న వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి.. మాస్క్ తప్పనిసరి - Vaikunta Dwara Darshan in Simhachalam Temple
Vaikunta Dwara Darshan in Simhachalam: సింహాద్రి అప్పన్న వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పట్లు చేశారు. కొవిడ్ మళ్లీ వ్యాపిస్తున్నందున సింహాచలానికి వచ్చే భక్తులందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలని ఆలయ ఈవో త్రినాధరావు విజ్ఞప్తి చేశారు. జనవరి 2న.. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు.
సింహాచలం