మన్యంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ దిశగా గంజాయి సాగు సమయంలోనే అడ్డుకునేందుకు, గిరిజనుల శైలిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్టు విశాఖ జిల్లా ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ ఎం.భాస్కరరావు వెల్లడించారు. ప్రత్యేకంగా గిరిజనుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మన్యంలో గంజాయి సాగుపై ఉక్కుపాదం..డ్రోన్లతో నిఘా - marijuana
విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి సాగు నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి సాగు చేపట్టకుండా గిరిజనులకు అవగాహన కల్పించటం, సాగును గుర్తించేందుకు డ్రోన్ల వినియోగం, రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టనున్నారు.
విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతోందని.. ఎనిమిది మండలాల్లోని945గ్రామాల్లోదీని ప్రభావం ఉందని గుర్తించామని భాస్కరరావు వివరించారు. ఇందులో ఐదు మండలాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. గంజాయి సాగుకు ప్రధాన రహదారి నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలను ఎంచుకుంటున్నారని చెప్పారు. పదివేల ఎకరాల్లో ఈ సాగు తొలుత ఉండేదని... మూడేళ్లుగా ఎక్సైజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాలతో ఐదువేల ఎకరాలకు పరిమితమైందని అన్నారు. గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించనున్నట్లు తెలిపారు. అలాగే శాటిలైట్ ద్వారా సమాచారం సేకరించనున్నట్లు సహాయ కమిషనర్ ఎం.భాస్కరరావు వెల్లడించారు. అలాగే రవాణాను అరికట్టేందుకు ఏజెన్సీలో ప్రత్యేక చెక్‌పోస్టులు అటు అటవీ, రెవెన్యూ శాఖలతో కలిపి ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.