ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపై మండపాలకు అనుమతించం: విశాఖ ఎస్పీ

కొవిడ్ నిబంధనలు పాటించి దసరా ఉత్సవాలు నిర్వహించాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నవరాత్రుల నిర్వహణకు రోడ్డుపై మండపాల ఏర్పాటుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

sp examined disha police station
దిశ పోలీస్​స్టేషన్​ను పరిశీలిస్తున్న ఎస్పీ

By

Published : Oct 17, 2020, 12:22 PM IST

విశాఖ జిల్లాలో కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. రోడ్డుపై మండపాలు పెట్టుకునేందుకు అనుమతించబోమని చెప్పారు. అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్​ను ఎస్పీ పరిశీలించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో మృతి చెందిన డాక్టర్ శ్యామల కేసు అన్నికోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: జగన్మాత దుర్గమ్మకు సీపీ దంపతుల తొలి సారె సమర్పణ

ABOUT THE AUTHOR

...view details