ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టండి' - SP review meeting with police officers in anakapalli news

విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీసు అధికారులతో ఎస్పీ బి.కృష్ణారావు.. సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.

SP review meeting
పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం

By

Published : Jan 28, 2021, 8:36 AM IST

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. అనకాపల్లిలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. గతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఎలక్షన్స్​ పారదర్శకంగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ తుసాన్ సిన్హా, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహేశ్వర రావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details