ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు

కరోనా నియంత్రణకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఏసీ కోచ్​లలో ఉలన్ దుప్పట్లు, ఏసీల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే
కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే

By

Published : Mar 14, 2020, 11:45 PM IST

కరోనా వైరస్​ కట్టడికి దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రైళ్లలోని ఏసీ కోచ్​లలో ఉలన్ దుప్పట్లను ప్రయాణికుల కోరికపై సరఫరా చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల చరవాణీలకు ఇందుకు సంబంధించిన సంక్షిప్త సమాచారం అందజేస్తామని రైల్వే అధికారులు వివరించారు. ఈ విధానం ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. బెడ్ షీట్లు, దిండ్లు, కవర్ ల పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది.

ఏసీ కోచ్ లలో ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల వరకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉలన్ దుప్పట్లు అవసరం లేని ప్రయాణికులు రైల్వేతో సహకరించి తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్లాట్ ఫారాలు, ప్రయాణికులు కూర్చునే స్థలాలు, సీట్లు, మెట్ల రైలింగ్​లు, తలుపుల రైలింగులు, కిటీకీలున్న ప్రదేశాల్లో అంటురోగ క్రిముల నివారణ కోసం చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details