ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శారదాపీఠంలో వేదోక్తంగా సౌర హోమం

విశాఖ శ్రీ శారదాపీఠం వేద ధ్వనితో మార్మోగింది. వార్షిక మహోత్సవాలతో పాటు రథసప్తమి వేడుకలు తోడై.. శుక్రవారం పీఠం ప్రాంగణమంతా కళకళలాడింది. సౌర హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు.

sourahomam at vishaka sri sarada peetam
అమ్మవారికి నక్షత్ర హారతిస్తున్న ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

By

Published : Feb 20, 2021, 9:25 AM IST

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథసప్తమి వేళ సౌర హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. సూర్యోదయ వేళలో పండితులు ఆదిత్యుడికి సూర్యనమస్కారాలు సమర్పించారు. స్వయంజ్యోతి మండపంలో సూర్యభగవానుడి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హారతులిచ్చారు.

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

రాజశ్యామల హోమం మూడో రోజు వైభవంగా కొనసాగింది. పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల అమ్మవారికి లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.. అమ్మవారికి నక్షత్ర హారతులిచ్చి నిత్య పీఠ పూజ నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి సలహాదారు జీవీడీ కృష్ణమోహన్.. ఉత్సవంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details