ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నతల్లి భారమైందని.. రైలెక్కించి పంపించేశారు.. - Divitipalli Railway Station Latest News

mother: అమ్మ.. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం. పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుంది. అలాంటి మాతృమూర్తి వృద్ధాప్యంలోకి రాగానే పిల్లలకు బరువైంది. కన్నతల్లి అనే మమకారం లేకుండా కఠిన హృదయాలతో ఆమెను బలవంతంగా వదిలించుకున్నారు. ఆ తల్లిని ఏదో ఓ రైలెక్కించి దూరంగా పంపేశారు ఆ కుమారులు. చివరకు రైల్వే సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

AMMA
అమ్మ

By

Published : Nov 5, 2022, 3:15 PM IST

Updated : Nov 5, 2022, 3:53 PM IST

అమ్మ

mother: 70 ఏళ్ల వార్ధక్యం.. పక్షవాతం వల్ల ఎడమకాలు, చేయి పనిచేయడం లేదు.. మానసిక స్థితి అంతంతమాత్రం.. ఒంటిపై దుస్తులు సరిగా లేవు. రెండు అడుగులు కూడా వేయలేని నిస్సహాయత.. ఓ వృద్ధురాలి దీనావస్థ ఇది. తమను నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లి అంతటి దుర్భర స్థితిలో ఉంటే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారులు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్నారు.. ఆమెను బలవంతంగా రైలెక్కించి దూరంగా పంపేశారు.

రైల్వే రోజువారీ నిర్వహణ పనుల కోసం శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన విశాఖపట్నం- కాచిగూడ రైలులో ఆ వృద్ధురాలిని సిబ్బంది గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వివరాలు అడగ్గా.. తన పేరు జొన్నలగడ్డ లక్ష్మి అని, కృష్ణా జిల్లా పునాదిపాడు అని ఆమె చెప్పారు. గుంటూరు సమీపంలో తన ఇద్దరు కుమారులు ఈ రైలులో ఎక్కించినట్లు తెలిపారు. రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారంతో మహబూబ్‌నగర్‌ ‘సఖి’ కేంద్రం కౌన్సిలర్‌ మహిమ, కానిస్టేబుల్‌ లక్ష్మి సఖి వాహనంలో దివిటిపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వృద్ధురాలికి దుస్తులు తొడిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె మెదడులోని కొన్ని నరాల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు ధ్రువీకరించారని ‘సఖి’ కేంద్రం నిర్వాహకురాలు మంజుల తెలిపారు.

"మాది ఏపీ. నాకు ఇద్దరు బాబులు. కాకినాడ వెళ్లే రైలు ఎక్కించారు. తమ్ముడి దగ్గర ఒకరోజు ఉందామని నా పెద్ద కుమారుడు చెప్పాడు.స్టేషన్​కి తమ్ముడు వస్తాడని చెప్పాడు. వస్తాడని చూశాను రాలేదు." -లక్ష్మి బాధితురాలు

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details