విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండు బాడిశవారు బలిజ పాలెంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మద్యం మత్తులోగేదెలకృష్ణ కన్నతల్లినూకలతల్లిని కొట్టి చంపాడు. బాగా మద్యం సేవించిన కృష్ణ ఇంటికి వచ్చి తల్లిని మద్యానికి డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న గిన్నెతో ఆమె తలపై బలంగా మోదాడు. ఆమె రక్తపుమడుగులో గిజగిజలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది.
దారుణం..మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు - son beated his mother under influence of alcohol and she died on spot
విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండు బాడిశవారు బలిజ పాలెంలో మద్యం మత్తులో కన్నతల్లిని కొడుకు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.

మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు
విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇవీ చదవండి: హుకుంపేట పోలీస్ స్టేషన్లో నలుగురికి కరోనా...