ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎల్వీకి వైకాపా ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే.. బదిలీ' - laxmi narayana on cslv transfer

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీపై తెదేపా నేత సోమిరెడ్డి, జనసేన నేత లక్ష్మీ నారాయణ స్పందించారు.

'ఎల్వీఎస్ కి వైకాపా ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే ఈ బదిలీ'

By

Published : Nov 5, 2019, 9:50 AM IST

'ఎల్వీఎస్ కి వైకాపా ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే ఈ బదిలీ'

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ సైతం...రివర్స్ లోనే జరిగిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి దుయ్యబట్టారు. సాధారణంగా సీఎస్... ఇతర ప్రిన్సిపల్ సెక్రట్రరీలను, ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తారని... ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయిందన్నారు. షోకాజ్ నోటీసు తీసుకున్న అధికారి... నోటీసు ఇచ్చిన అధికారిని బదిలీ చేయడం వింత పోకడ అన్నారు. తితిదేలో అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలే ఎల్వీఎస్ కొంప ముంచాయా అని అనుమానం వ్యక్తం చేసారు. ఎన్నికల కోడ్ సమయంలో తెదేపా అంతం కోరుకున్న ఎల్వీఎస్ కు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే ఈ బదిలీ అని సోమిరెడ్డి ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

కాల వ్యవధిపై పరిశీలిస్తా....

సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల అధారంగా సివిల్ సర్వెంట్లకు ఒక పోస్టింగ్ ఇచ్చినపుడు ఒక నిర్ణీత కాల వ్యవధి పాటించాల్సి ఉంటుందని మాజీ ఐపీఎస్ అధికారి, జనసేన నేత లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఆ తరహా కాలవ్యవధిని నిర్ణయించారా లేదా అన్నది పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అకస్మిక బదిలీ పై ఆయన విశాఖలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి

రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని!

ABOUT THE AUTHOR

...view details