ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మారుమూల గ్రామ‌స్థుల దాహార్తిని తీర్చిన పోలీసుశాఖ‌ - Drinking Water problem solve in visakha Agency

ఎన్నో ఏళ్లుగా మంచినీటి స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న గిరి గ్రామ‌స్థుల‌కు పోలీసుశాఖ చొర‌వ‌తో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింది. దీంతో ఆ గ్రామ‌స్థులు ఆనందానికి అవధుల్లేవు.

 Solution to the drinking water problem with the initiative of the police
Solution to the drinking water problem with the initiative of the police

By

Published : May 11, 2021, 1:59 PM IST

విశాఖ మ‌న్యంలోని కొయ్యూరు మండ‌లం బూద‌రాళ్ల పంచాయ‌తీ బాల‌రేవుల గ్రామానికి కొన్నేళ్లుగా మంచినీటి స‌దుపాయం లేదు. దీంతో గ్రామ‌స్థులు కొండ‌లు నుంచి వ‌చ్చే నీరుపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. ఈ విష‌యాన్ని స్థానిక పోలీసులు దృష్టికి తీసుకెళ్ల‌డంతో స్పందించి వారు విష‌యాన్ని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో మాట్లాడి అమృత జ‌ల‌ధార ప‌థ‌కం కింద ఉచిత మంచినీటి ప‌థ‌కం నిర్మించ‌డానికి పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. తాగు నీటి ప‌థ‌కం నిర్మాణం పూర్త‌వ్వ‌డంతో సోమ‌వారం జిల్లా అద‌న‌పు ఎస్పీ(ఆప‌రేష‌న్స్‌) ఎస్‌.స‌తీష్‌కుమార్‌. న‌ర్సీప‌ట్నం ఏఎస్పీ తుహీర్‌సిన్హా చేతులు మీదుగా మంచినీటి ప‌థ‌కం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా త‌మ గ్రామ‌స్థులు దాహార్తిని తీర్చ‌డానికి వ‌చ్చిన పోలీసు, రెవిన్యూ అధికారుల‌కు గిరిజ‌నులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జిల్లా అద‌న‌పు ఎస్పీ స‌తీష్ కుమార్ మాట్లాడుతూ... మారుమూల ప్రాంతాలు స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి పోలీసుశాఖ ఎప్పుడు ముందుంటుంద‌న్నారు. విశాఖ మ‌న్యంలో అనేక మారుమూల గ్రామాల్లో ఇటువంటి కార్య‌క్ర‌మాల చేప‌ట్టామ‌ని.. ఇందులో భాగంగా సోమ‌వారం బాల‌రేవుల గ్రామంలో మంచినీటి ప‌థ‌కం ప్రారంబించామ‌ని ఆయ‌న అన్నారు.

ABOUT THE AUTHOR

...view details