మహా విశాఖ జోన్-1 పరిధిలోని కొమ్మాదీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజారును మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనందపురం లోపల ఉన్న గ్రామాల నుంచి కూరగాయలు తీసుకురావటం కష్టం ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి అవంతి అధికారులతో మాట్లాడి రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
సామాజిక దూరంతో కరోనా సమస్యకు పరిష్కారం: మంత్రి అవంతి - కరోనా తాజా వార్తలు
రైతు బజార్లలో కూరగాయలు కొనే సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. మహా విశాఖ జోన్-1 పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజారును సందర్శించిన ఆయన..స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చన్నారు.
సామాజిక దూరంతో కరోనా సమస్యకు పరిష్కారం