సాగర తీరం విశాఖలో తన సినిమా చిత్రీకరణ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ అన్నారు. తాను నటిస్తోన్న 'సోలో బతుకే సో బెటర్' చిత్రం షూటింగ్లో భాగంగా చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. విశాఖ చాలా అందంగా ఉందని.. ఇటువంటి ప్రదేశంలో షూటింగ్ చేస్తానని అనుకోలేదని సినీ నటి నబా నటేష్ అన్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా... తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే1న చిత్రం విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైందని చిత్ర బృందం తెలిపింది.
విశాఖలో 'సోలో బతుకే సో బెటర్' చిత్ర బృందం సందడి - solo bathuke so better movie release date
ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న 'సోలో బతుకే సో బెటర్' చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. సుందరమైన విశాఖలో తాము చిత్రీకరణ చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కథానాయకుడు వరుణ్‌తేజ్ తెలిపారు.
![విశాఖలో 'సోలో బతుకే సో బెటర్' చిత్ర బృందం సందడి విశాఖలో సందడి చేసిన 'సోలో బతుకే సో బెటర్' చిత్ర బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6009766-395-6009766-1581241950217.jpg)
విశాఖలో సందడి చేసిన 'సోలో బతుకే సో బెటర్' చిత్ర బృందం
విశాఖలో చిత్రీకరణ చేయడం ఆనందంగా ఉందన్న నటుడు సాయిధరమ్‌తేజ్