విశాఖ గ్రామీణ జిల్లాలో ఇటీవల జరిగిన మైనింగ్ దాడుల్లో భారీగా జరిమానా విధించిన మైనింగ్ విజిలెన్స్ అధికారిని అనకాపల్లి ప్రజా సంఘాల సభ్యులు అభినందించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకారం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు ప్రజా సంఘాల సభ్యులు వినతి పత్రం అందజేశారు. అనకాపల్లితో పాటు గ్రామీణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు శృతి మించాయని ప్రజా సంఘాల సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సభ్యులు చిన్ని యాదవ్, బొడ్డేడ అప్పారావు, మట్టా కుమార్, జోగారావు పాల్గొన్నారు.
'మైనింగ్ వ్యవహారంలో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి'
అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లిలో ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. మైనింగ్ దాడుల్లో భారీగా జరిమానా విధించిన అధికారిని అభినందించారు.
ఆర్డీవో సీతారామారావుకు ప్రజా సంఘాల సభ్యులు వినతి పత్రం