విశాఖలో అత్యంత ప్రమాదకరమైన నాగుపామును స్థానికులు గుర్తించారు. మర్రిపాలెం 104 ఏరియా నావెల్ క్వార్టర్స్ వద్ద సూమారు ఎనిమిది అడుగుల విషసర్పం కనిపించింది. వెంటనే స్నేక్ సేవర్కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ సేవర్ కిరణ్ కుమార్... పామును చాకచక్యంగా పట్టుకుని...దాహం తీర్చారు. పాము నీళ్లు తాగటాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం పామును నావెల్ అధికారులకు అప్పగించాడు. వాళ్లు పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా స్నేక్ సేవర్ కిరణ్ మాట్లాడుతూ... పాముకాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా పాము కనిపిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపాము.. దాహం తీర్చిన స్నేక్ సేవర్ - విశాఖలో పాము కాటు బాధితుల సంఖ్య వార్తలు
విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపామును స్నేక్ సేవర్ పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రజలు పాముకాటుకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపాము కలకలం