ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కలకలం... కారు బ్యానెట్​లో దూరిన పాము!

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ... ఓ పాము పాకుకుంటూ వెళ్లి ఒక కారు బానెట్​లో దూరింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. చివరికి పాములు పట్టే వ్యక్తి సహాయంతో సర్పాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన విశాఖ రైల్వే న్యూ కాలనీ లో జరిగింది.

Snake biting in car bonnet at vizag
కారు బ్యానెట్​లో దూరిన పాము

By

Published : Jun 19, 2021, 7:48 AM IST

Updated : Jun 19, 2021, 7:57 AM IST

కారు బ్యానెట్​లో దూరిన పాము

సిటీ కల్చర్​కు కేరాఫ్ అయిన విశాఖ నగరంలో.. 24 గంటలూ జనం రోడ్లపై తిరుగుతూనే ఉంటారు. నగరం నలువైపులా ప్రజల కదలికలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో.. సడన్ గా దర్శనమిచ్చిన ఓ పాము అందరినీ కంగారు పెట్టించింది. భయంతో జనాన్ని పరుగులు తీసేలా చేసింది. వాహనంలో దూరి బయటకు రాకుండా ముచ్చెమటలు పట్టించింది. అంతా ఆందోళన చెందుతున్న వేళ.. పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. చాకచక్యంగా.. ఆ పామును ఒడిసిపట్టాడు. అందరిలో భయాన్ని పోగొట్టి.. ఉపశమనం కలిగించాడు. ఈ ఘటన.. నగరంలోని న్యూ రైల్వే కాలనీలో జరిగింది.

అసలు ఏం జరిగింది?

కాలనీలో రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఓ కారుపై.. ఉన్న ఫళంగా ఓ పాము దర్శనమిచ్చింది. అది.. కారు ఫ్రంట్ మిర్రర్​పై పాకుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సర్పాన్ని చూడగానే.. పరిసర ప్రాంతాల్లోని జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అంతలోనే.. ఆ పాము కారు బ్యానెట్ లోకి దూరిపోయింది. ఎంత సేపైనా బయటికి రాలేదు. ఇది.. అక్కడి జనాల్లో మరింత భయాన్ని, ఆందోళనను పెంచింది.

చాకచక్యంగా.. అత్యంత జాగ్రత్తగా...

ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో.. అక్కడి ప్రజలు పాములు పట్టే వ్యక్తి కిరణ్​కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును చూడాలన్న ఆరాటంతో.. అక్కడికి వచ్చిన జనాన్ని అదుపు చేశారు. ఎవరూ ఆ పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు... విషయం తెలిసిన వెంటనే.. కిరణ్ న్యూ రైల్వే కాలనీకి చేరుకున్నాడు. పాము కదలికలు గుర్తించాడు. ఎవరికీ ఏ ప్రమాదం కలగకుండా.. అత్యంత చాకచక్యంగా.. ఆ పామును కిరణ్ పట్టుకున్నాడు.

పామును చూసి కేరింతలు

కిరణ్.. పామును పట్టుకోగానే.. స్థానికుల్లో ఉన్న భయం మాయమైంది. అంతా కలిసి.. కేరింతలు కొడుతూ ఆ సందర్భాన్ని ఆస్వాదించారు. కిరణ్ సైతం.. బుసలు కొడుతున్న సర్పాన్ని ఒడుపుగా పట్టుకుని అందరిలో ఉత్సాహం నింపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అక్కడ ఉన్న వాళ్లంతా కేరింతలు కొట్టారు. ఈ సందర్భాన్ని తమ చరవాణుల్లో చిత్రీకరించేందుకు ఉత్సాహం చూపారు. పాముతో ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడిన కిరణ్.. ఆ సర్పానికి సైతం అపాయం కలగకుండా జాగ్రత్తపడ్డాడు. అక్కడి నుంచి జాగ్రత్తగా మరో ప్రాంతానికి తరలించారు. స్థానిక పోలీసు సిబ్బంది సైతం.. కిరణ్ కు సహకరించి.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడ్డారు.

ఇదీ చదవండి:

పోలవరం ముంపు గ్రామాలకు వరద భయం

Last Updated : Jun 19, 2021, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details