పాము కాటుతో మహిళ మృతి - snake bite women died in vishaka
పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన విశాఖ ఏజెన్సీలో జరిగింది. హుకుంపేట మండలం కరపవలస గ్రామానికి చెందిన మహిళ పాముతో గతరాత్రి మృతిచెందింది.
పాము కాటుతో మహిళ మృతి
విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం కరపవలస గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన వంతల కాటి అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. నిన్న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.