ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుతో బాలుడు మృతి - crime news in visakha dst

విశాఖ మన్యంలో పాముకాటుకు గురై 15 నెలల బాలుడు మృతి చెందాడు. రాత్రి సమయంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలుడిని ఇంట్లోకి వచ్చిన పాము కాటేసిన కారణంగా అక్కడిక్కడే చనిపోయాడు.

snake bite in visakha dst died 15 months baby
snake bite in visakha dst died 15 months baby

By

Published : Aug 16, 2020, 3:12 PM IST

విశాఖపట్నం ఏజెన్సీ జి.మాడుగుల మండలం బీరం పంచాయతీ వీ.కొండపల్లిలో రాంబాబు, దేవుడమ్మ దంపతుల కుమారుడిని పాము కాటేసింది. తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న 15 నెలల బాలుడిని అర్ధరాత్రి ఇంట్లోకి పాము చొరబడి కాటు వేసింది.

బాలుడు ఏడుస్తూ నురగలు కక్కుతూ చనిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పామును గుర్తించి హతమార్చారు. పసివాడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details