విశాఖ జిల్లా.. హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ప్రహరీకి ఆనుకొని ఉన్న రాంనగర్‌లోని ఓ ఇంట్లో మంగళవారం నాగుపాము చొరబడింది. కుటుంబ సభ్యులు పాములు పట్టే నేర్పరి నాగరాజుకు సమాచారం ఇచ్చారు. అతను అక్కడకు చేరుకొని పామును బంధించాడు. దాన్ని గోనె సంచిలో వేస్తుండగా.. పాము తల బయటకు వచ్చింది.
ఆ విషయాన్ని చీకట్లో గమనించలేదు. సంచికి తాడు కడుతుండగా చేతిపై కాటు వేసింది. వెంటనే కేజీహెచ్‌కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. నాగరాజు చేతిపై పాము పన్ను దిగి విరిగిపోయినట్లు గుర్తించి దానిని తొలగించారు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అనేది తెలియాలంటే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుందని.. అయితే ప్రమాదం లేదని చెప్పారు.