వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలతో విశాఖ జిల్లా మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం ఆవరణం నిండిపోతోంది.కొన్నేళ్లుగా పట్టుబడిన వాహనాలు ఎండకి ఎండుతూ... వానకి తడుస్తూ.. తుప్పు పడుతున్నాయి. కొన్ని మట్టిలో కూరుకుపోతున్నాయి.. ఇంకొన్ని వాహనాలపై మొక్కలు, పొదలు పెరుగుతున్నాయి. పాడైపోతున్న వాహనాల్లో ఆటోలు, కార్లు, బైకులు, జీపులు, లారీలున్నాయి. ఈ వాహనాలన్నీ గంజాయి, సారా ఇతర అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డాయి. వీటి పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడు.
తుక్కు అలా... అధికారుల తీరును తప్పు పడుతోందిలా... - అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వార్తలు
అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు ప్రొబేషన్ ఎక్సైజ్ కార్యాలయంలో పేరుకుపోతున్నాయి. వీటిని పట్టించుకున్న వారే లేకుండాపోయారు. దీంతో ఎండకి ఎండుతూ.. వానకి తడుస్తూ.. తుప్పు పడుతున్నాయి. కాదు కాదు.. అధికారుల పనితీరును తప్పు బడుతున్నాయి కూడా. అయినప్పటికీ పై అధికారుల నుంచి ఆదేశాలు లేవంటున్నారు అక్కడి అధికారులు.
![తుక్కు అలా... అధికారుల తీరును తప్పు పడుతోందిలా... smuggling cases Vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6098408-493-6098408-1581916508056.jpg)
మాడుగుల ప్రొబేషన్ ఎక్సైజ్ కార్యాలయంలో పేరుకుపోయిన వాహనాలు
మాడుగుల ఎక్సైజ్ కార్యాలయంలో పేరుకుపోయిన వాహనాలు
ఇవీ చూడండి...
బీహార్‌కి గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్
Last Updated : Feb 17, 2020, 2:04 PM IST