ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన కేబుల్ వద్ద మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఎస్ఈ నాగేశ్వర్ రావు, ఈఈ రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రాజెక్ట్ పరిధిలో గల మాచ్‌ఖండ్, ఓనకడిల్లి, జోలపుట్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం అధికారుల చొరవతో విద్యుత్ పునరుద్ధరించారు.
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం - Machkhand Hydroelectric Power Station fire accident
విశాఖపట్నం జిల్లాలోని మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం