అది పాడుబడ్డ ఇల్లు... ఆ ఇంటి గోడలపై పిచ్చిరాతలు. మాదకద్రవ్యాలు, చిన్నపాటి దొంగతనాలకు అలవాటుపడిన ఆ ఇంట్లో ఉండే యువకుడు రాజు తీరు... పొరుగిళ్లవారికి ఎప్పుడూ అభ్యంతరకరమే. ఇవన్నీ చాలవన్నట్లు... కొత్తగా మనిషి పుర్రెతో కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. విశాఖ రెల్లివీధిలో ఆదివారం.. రాజును పుర్రెతో చూసిన స్థానికులు... తలను తింటున్నాడని అనుమానించారు. అదే కంగారులో.... చూసిందంతా పోలీసులకు చేరవేశారు. అప్పటికే రాజుపై సస్పెక్ట్ షీట్ కూడా ఉండడంతో....... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించేసరికి.. శివపూజ కోసమే తలను తీసుకొచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆ పుర్రెను ఎక్కడ నుంచి సంపాదించాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తే.... విశాఖ కేజీహెచ్ అనాటమీ విభాగం నుంచి తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చాడు. సాధారణంగా.. కేజీహెచ్ అనాటమీ విభాగంలో వైద్య విద్యార్థులు పరిశోధనల కోసం.. మృతదేహాలను పరిశీలించి విడిభాగాలను అక్కడే వదిలేస్తుంటారు. అక్కడి నుంచి తలను తీసుకొచ్చి.... కళ్లద్దాలు తొడిగి.. 14 రోజులుగా పూజలు చేస్తున్నట్లు...... పోలీసుల విచారణలో రాజు చెప్పినట్లు తెలుస్తోంది. శివ భక్తుడైన రాజు తలకు పూజలు చేస్తే మంచి జరుగుతుందన్న భావనతోనే అంతా చేశానని చెప్పాడు.
కుటుంబంలో రాజు.. అందరికన్నా చిన్నవాడు. అయితే ఆహార్యం మాత్రం భయంకరంగా ఉంటుంది. తన ఇంటి వాతావరణం కూడా పాడుబడ్డ భవనంలా ఉంది. రాజు తండ్రి శ్యామ్.... ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అనారోగ్యం కారణంగా ఆయన ఆరేళ్ల కిందటే చనిపోయారు. అప్పటినుంచి... ఒక సంవత్సరం పాటు రాజు తల్లితో ఉండేవాడు. ఆమె పూర్ణామార్కెట్‌లో పండ్లు విక్రయిస్తుండేది. చెడువ్యసనాలకు బానిసైన రాజును..... ప్రవర్తన మార్చుకోమని చెప్తూ ఉండేంది. కొన్నిసార్లు తల్లిపై దాడి చేస్తూ గాయపరిచేవాడు. రాజుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఎంత చెప్పినా లాభం లేకపోయేసరికి విసిగిపోయిన తల్లి.... ఐదేళ్ల కిందట రాజును వదిలి ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత రాజు ప్రవర్తన మరింత మితిమీరింది.