ఆంధ్ర విశ్వవిద్యాలయం డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలోనైపుణ్యాభివృద్ధి కోర్సులు నిర్వహిస్తున్నట్టు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ డైరెక్టర్ ఎస్.పల్లంశెట్టి ప్రకటనలోతెలిపారు. ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయని, మూడు నెలల కాలపరిమితి ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి నిర్వహించే కోర్సులకు మాజీ సైనిక ఉద్యోగులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీ లోగా ‘డైరెక్టర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, ఏయూ ఉమెన్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం, ఆంధ్ర విశ్వవిద్యాలయం(శివాజీ పార్కు సమీపంలో)’ చిరునామాలో దరఖాస్తులు అందించాలన్నారు.
ఏయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ - taja news in andhra universiyt
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో కోర్సులకు వర్సిటీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ డైరెక్టర్ పల్లంశెట్టి కోర్సకు సంబంధించి ధరఖాస్తు విధానం, వివరాలను వెల్లడించారు.
మరిన్ని వివరాలకు Rdirector.eds@andhrauniversity.idu.in వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఏయూ సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆచార్య ఎస్.పల్లంశెట్టి తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు, మాజీ సైనికులు అర్హులన్నారు. 24 వారాల నుంచి మూడేళ్ల పాటు కొనసాగే వివిధ కోర్సుల్లో చేరేవారు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 95815 71905 నంబరులో సంప్రదించాలన్నారు.
ఇదీ చూడండి