ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఎన్​ఏడీ వంతెనపై ప్రమాదం... ఆరుగురికి గాయాలు

By

Published : Oct 15, 2020, 5:37 PM IST

విశాఖపట్నం ఎన్​ఏడీ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్​తో వెళ్తున్న లారీ... అదుపు తప్పి విభాగిని ఎక్కి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్వ గాయాలయ్యాయి.

six people injured on road accident at vizag district
విశాఖ ఎన్​ఏడీ పై వంతెనపై ప్రమాదం

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం నుంచి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ... ఎన్ఏడీ పైవంతెన వద్ద అదుపుతప్పింది. విభాగినిపైకి దూసుకుపోయి అటుగా వస్తోన్న ఆటోపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా... ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details